న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నందున 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సైబర్ భద్రత కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ గురువారం వెల్లడించింది. కంపెనీ త్రైమాసిక నివేదిక గురువారం వెలువడిన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోయి 14 శాతానికి పైగా నష్టపోయాయి. వెంటనే కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది.
కంపెనీలో అంతర్గతంగా ఏఐ వినియోగం మూడు నెల్లలోనే 600 శాతం పెరిగిందని.. దీంతో హెచ్ఆర్, ఇంజినీరింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు తెలిపింది. సంస్థను విడిచి వెళ్లేవారికి అత్యుత్తమ ఉద్యోగ విరమణ ప్యాకేజీ అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకులు హామీ ఇచ్చారు.