Cloud seeding | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. తీవ్రమైన వాయుకాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కృత్రిమ వర్షం (artificial rain) కురిపించేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం ముందుగా నగరంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ (Cloud seeding) ప్రక్రియను నిర్వహించింది. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌కు చెందిన విమానం ద్వారా మేఘాలపై చల్లి ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మరికాసేపట్లో ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఖేక్రా, బురారి, మయూర్ విహార్ సహా పలు ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ నిర్వహించినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ దాదాపు అరగంటపాటూ సాగినట్లు వివరించారు. ఇది విజయవంతమైతే వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు.
#WATCH | Aircraft for cloud seeding in Delhi has taken off from Kanpur, Uttar Pradesh.
(Video Source: IIT Kanpur media cell) pic.twitter.com/hxhMQLvMPk
— ANI (@ANI) October 28, 2025
Also Read..
Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు
BJP MLA | యమునా శుభ్రతపై రీల్స్.. అదుపుతప్పి నదిలో పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. VIDEO
Gold Rates | మరింత దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం