ముంబై, అక్టోబర్ 30 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా, రెండు ప్రధాన రాజకీయ కూటముల నుంచి 150 మందికిపైగా రెబల్స్ బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూటముల పక్షాన అధికార అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్ నామినేషన్లు వేశారు. మహాయుతి పక్షాన అత్యధికంగా 80 మంది రెబల్స్ బరిలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆయా పార్టీలకు వారం రోజుల గడువు లభించింది. అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు అభ్యర్థులను పోటీకి దింపామని రెండు కూటములూ ప్రకటించాయి.