Student | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని (Student) పాఠశాల వాష్‌రూమ్‌లో (school toilet) బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన యాద్గిర్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా.. గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గిర్ (Yadgir) జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వాష్‌రూమ్ లోపల తొమ్మితో తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వారు షాహాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అంతేకాదు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read..
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Himachal Pradesh | హిమాచల్‌పై ప్రకృతి ప్రకోపం.. 310 మంది మృతి