Traffic Jam | ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీ సహా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఎక్కడికక్కడ వరదలు సంభవిస్తున్నాయి. పలుచోట్ల భారీగా కొండచరియలు విరిగిపడి రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి.
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చండీగఢ్-కులు హైవే (Chandigarh-Kullu Highway)పై దాదాపు 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్కు (Delhi-NCR) పండ్లు, కూరగాయలు (fruits and vegetables) తీసుకెళ్లే వందలాది ట్రక్కులు సహా వేలాది వాహనాలు ఆ మార్గంలో నిలిచిపోయాయి (Trucks Stuck). చండీగఢ్-మనాలీ హైవేపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో పలు వాహనాలు రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ట్రాఫిక్ కారణంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విలువైన సరకు కుళ్లిపోతోందని వాపోయారు. ప్రతి ట్రక్కు విలువ దాదాపు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఇక దాదాపు రూ.50 కోట్ల విలువైన ఆపిల్ సరకు ఇక్కడ నిలిచిపోయిందని తెలిపారు. ఓ ట్రక్కు డ్రైవర్ మాట్లాడుతూ.. సాహిబాబాద్ పండ్ల మార్కెట్‌కు ఆపిల్ లోడ్‌తో వెళ్తున్నానని అయితే, భారీ వర్షం, వరదల కారణంగా ఐదు రోజులుగా కులులో చిక్కుకుపోయినట్లు చెప్పారు. సాహిబాబాద్, ఆజాద్‌పూర్ మండీలకు వెళ్లే వేలాది ట్రక్కులు ఇక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు.
Also Read..
Army foils infiltration bid | చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
Jaish terrorists | బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు.. రాష్ట్రంలో హైఅలర్ట్
Himachal Pradesh Floods | హిమాచల్‌లో భారీ వరదలు.. మనాలి టోల్ ప్లాజాను ముంచెత్తిన బియాస్ నది