Army foils infiltration bid | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని బందిపోరా (Bandipora) జిల్లాలో నియంత్రణరేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి (Army foils infiltration bid). గురేజ్ సెక్టార్‌లోని నౌషెరా నార్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను (terrorists) భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
చొరబాటు ప్రయత్నం జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఎల్ఓసీ (Line of Control) వద్ద భారత సైన్యం అప్రమత్తమైంది. గురేజ్ సెక్టార్ (Gurez sector)లో సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన దళాలు కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు సైతం సైన్యంపై ఎదురు కాల్పులకు దిగారు. అయితే, మన సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు నక్కిఉన్నారని భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఆపరేషన్ కొనసాగుస్తున్నాయి.
Also Read..
Jaish terrorists | బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు.. రాష్ట్రంలో హైఅలర్ట్
Building Collapses | ఇల్లీగల్ బిల్డింగ్ కూలి 15 మంది మృతి.. భవనం యజమాని అరెస్ట్
Bomb Threat | 20 కళాశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్