Viral News | ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా?.. పరీక్ష రాసేందుకు వెళ్లి.. అమ్మాయిలను చూసి
పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
Viral News | పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం బుధవారం గణితం పరీక్ష ఉంది. దీంతో మనీశ్‌ను పరీక్ష హాల్ వద్దకు అతని తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో ఎగ్జామ్‌కు టైం అవుతుండగా మనీశ్ పరీక్ష హాల్లోకి వెళ్లారు. అయితే, అక్కడ మొత్తం అమ్మాయిలే ఉండటంతో వారిని చూసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. గమనించిన పాఠశాల యాజమాన్యం మనీశ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ పరీక్షహాల్లో 50 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి మధ్య శంకర్ ప్రసాద్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయినట్టు ఆయన తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

