పాట్నా, ఆగస్టు 22: పారదర్శకంగా నియామక ప్రక్రియ జరగాలని కోరుతూ పాట్నాలోని లోక్‌భవన్‌కు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులతో ఘర్షణ పడిన పలువురు నిరుద్యోగులు అరెస్టయ్యారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్న ఈ ర్యాలీని ఆర్-గోలుంబర్ సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు.
బారికేడ్లను ఛేదించుకొని వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది స్వల్ప బలప్రయోగం చేసినట్టు అధికారులు తెలిపారు. అనంతరం పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.