జంతర్‌మంతర్‌లో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్'తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు.
న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. జూన్ 20 నుంచి ఇక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆయన ఈ దీక్షను ప్రారంభించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలసి రాజ్‌ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. వందలాది మంది యువకులు, విద్యార్థులు, రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌కు చెందిన రైతులను ఇక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారని దీప్కే ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. దేశంలోని మొత్తం విద్యావ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తాము కోరుతున్నామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

