న్యూఢిల్లీ, జూన్ 18: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘కాక్రోచ్జనతా పార్టీ’ (సీజేపీ)..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద మరోమారు నిరసనకు సిద్ధమైంది. శనివారం శాంతియుత నిరసన, విద్యార్థుల ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ..జూన్ 20న చేపట్టే నిరసనలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గురువారం ఈమేరకు పిలుపునిచ్చింది.
సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రన్కా మాట్లాడుతూ, గత 24 గంటల్లో ఇద్దరు నీట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. జంతర్‌మంతర్ వద్ద శనివారం నాటి నిరసనకు ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.