న్యూఢిల్లీ: నేటి యువ న్యాయవాదులకు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు జస్టిస్ హిమా కోహ్లీ రోల్ మోడల్‌గా నిలుస్తారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశంసించారు. ఈ వృత్తిలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆమె గళం ప్రస్తావించిందన్నారు. పదవీ విరమణ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జి హిమా కోహ్లీ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమె న్యాయపాలన కోసం నిలబడిన వ్యక్తి, వృత్తిలో ప్రభావశీలి అని పేర్కొన్నారు. ఆమె సున్నితత్వ, న్యాయపరమైన నిర్ణయాలను ప్రశంసించారు. మూడేండ్లకు పైగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ హిమా కోహ్లీ సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు.