న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బుధవారం రాత్రి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. బైసాకి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్డెన్ టెంపుల్ను సందర్శించాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. పర్యటనలో భాగంగా సీజేఐ అట్టారీ-వాఘ్ సరిహద్దును సందర్శించారు. ‘బీటింగ్ రీట్రీట్’ను తిలకించారు.