సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించొచ్చు: సీజేఐ ఎన్వీ రమణ
NV Ramana | సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని
న్యూఢిల్లీ: సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిసి సంతోషిస్తున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన హైకోర్టు జడ్జిల సదస్సును సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీలను ఏడాదిలోపు భర్తీ చేయగలిగామని వెల్లడించారు. మరో 50 నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఇప్పటికీ ఖాళీలున్న హైకోర్టు సీజే పేర్లను పదోన్నతి కోసం పంపాలని కోరారు. ఏడాది కాలంలో సుప్రీంకోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు, హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని చెప్పారు. తనకు సహకరించిన కొలీజియం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సదస్సులో హైకోర్టు జడ్జిల నియామకం, తదుపరి చేపట్టాల్సిన చర్యలు, జడ్జిల వేతనాలు, పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు పెంచడంపై చర్చించారు. కాగా, శనివారం జరుగనున్న న్యాయ సదస్సుకు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకున్నారు. ఇందులో భాగంగా నేడు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

