Supreme Court | సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తాను సీఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానన్నారు. తాను ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలిని సమర్థించానన్నారు. సుప్రీంకోర్టులో 2వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారని.. న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులే కుండా సిబ్బంది జీవన విధానాన్ని సైతం పరిశీలించాలన్నారు.
#WATCH | Delhi: CJI DY Chandrachud inaugurates AYUSH Holistic Wellness Centre at the Supreme Court premises. pic.twitter.com/SxOF6dSnNV
— ANI (@ANI) February 22, 2024
ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌కాల్ చేసిన సంఘటనను సీజేఐ ఈ సందర్భంగా వెల్లడించారు. కరోనా సమయంలో తన పరిస్థితి ఘోరంగా ఉందని.. ఆ సమయంలో ప్రధాని మోదీ ఫోన్ చేసి అంతా సర్దుకుంటుందని తెలిపారన్నారు. ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని ఆయుష్ వైద్యుడు, ఆయుష్ కార్యదర్శితో మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తానని.. మందులు ఇస్తారని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కొవిడ్ సమయంలో ఆయుష్ మెడిసిన్ తీసుకున్నానని తెలిపారు.
#WATCH | Delhi: CJI DY Chandrachud inaugurates AYUSH Holistic Wellness Centre at the Supreme Court premises.
He says, “For me, this is a satisfying moment. I have been working on this ever since I took over as CJI. I am a proponent of Ayurveda and holistic lifestyle. We have… pic.twitter.com/GmmGabMQDY
— ANI (@ANI) February 22, 2024
అల్లోపతి మెడిసిన్స్ తీసుకోలేదనన్నారు. ఉద్యోగులు, కుటుంబాల గురించి తాను ఆందోళన చెందుతున్నానన్నారు. వారికి న్యాయమూర్తులతో సమానంగా సౌకర్యాలు లేవన్నారు. న్యాయమూర్తులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాను యోగా చేస్తానని.. ఐదునెలలుగా వీగన్ డైట్‌ను ఫాలో అవుతున్నానన్నారు. ఇకపై అదే కొనసాగిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో పాటు వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.