న్యూఢిల్లీ, ఆగస్టు 3: ప్రజలు కోర్టు వ్యవహారాలతో విసిగిపోయి ఉన్నారని, అందువల్లే వారు సెటిల్మెంట్ కోరుకుంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీజేఐ ప్రసంగిస్తూ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలుగా ‘లోక్ అదాలత్’లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం గత వారం రోజులుగా(ఆగస్టు 3 వరకు) స్పెషల్ లోక్ అదాలత్‌ను నిర్వహించింది.