న్యూఢిల్లీ: వచ్చె నెల 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025కు సంబంధించి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈసారి మొత్తం 979 ఖాళీలను భర్తీ చేయబోతున్నది. 38 ఖాళీలను దివ్యాంగులకు రిజర్వ్ చేసింది. మెయిన్స్ పరీక్షలను ఆగస్టు 22, 23, 24, 30, 31వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈమేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. పూర్తి టైమ్ టేబుల్‌ను upsc.gov.in వెబ్సైట్ లో చూడవచ్చు.
విద్యార్థులకు ఉత్తమ నగరం సియోల్ ; క్యూఎస్ ర్యాంకింగ్స్ జీవన వ్యయంలో ఢిల్లీకి ఫస్ట్ ప్లేస్
న్యూఢిల్లీ: విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నిలిచింది. గత ఆరేండ్లుగా మొదటి స్థానంలో ఉన్న లండన్ ఈ సారి మూడోస్థానానికి పడిపోయింది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ప్రపంచంలోని 130 అత్యుత్తమ నగరాల జాబితాను క్యూఎస్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ(104) , ముంబై (98), బెంగళూరు(108), చెన్నై (128)చోటు దక్కించుకున్నాయి. విద్యార్థులకు అత్యంత అందుబాటు ధరలలో ఉన్న ప్రపంచ నగరాలలో దేశ రాజధాని ఢిల్లీకి మొదటి స్థానం లభించింది.