న్యూఢిల్లీ: వెయ్యి మందికి పైగా మహిళా సిబ్బంది కలిగిన మొట్టమొదటి పూర్తి మహిళా సీఐఎస్ఎఫ్ రిజర్వ్ బెటాలియన్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో మంజూరు చేసింది. విమానాశ్రయాలు, పరిశ్రమల్లో వేగంగా పెరుగుతున్న భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బెటాలియన్‌ను ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
1,025 మంది సిబ్బంది కలిగిన మహిళా బెటాలియన్‌కు సీనియర్ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారు. సీఐఎస్ఎఫ్కు మంజూరైన రెండు లక్షల సిబ్బంది లోంచే ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.