అహ్మదాబాద్: గుజరాత్లో కలరా కేసులు కలకలం రేపాయి. గాంధీనగర్ జిల్లాలోని కలోల్ పట్టణంలో గత కొన్ని రోజుల వ్యవధిలో నలుగురికి కలరా సోకింది. బాధితులకు దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని, వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని అధికారులు శుక్రవారం పేర్కొన్నారు.
మరో 11 అనుమానిత కేసులను గుర్తించినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు 2 కిలోమీటర్ల పరిధిని నెల రోజుల పాటు అంటువ్యాధుల చట్టం కింద జిల్లా కలెక్టర్ నోటిఫై చేశారు.