డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో క్లోరిన్ గ్యాస్(Chlorine Gas) లీకైన ఘటన చోటుచేసుకున్నది. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో ఈ సంఘటన జరిగింది. నగరంలోని జాంజ్రా ఏరియాలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో క్లోరిన్ గ్యాస్ సిలిండెర్ను ఉంచారు. అయితే క్లోరిన్ గ్యాస్ వల్ల శ్వాసపీల్చే సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున ఆ ప్రాంతంలో ఉన్న స్థానికుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు. క్లోరిన్ గ్యాస్ సిలిండర్ పెట్టిన ప్రాంతానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారు. క్లోరిన్ గ్యాస్ సిలిండర్ గురించి తమకు సమాచారం రాగానే అక్కడకు భద్రతా బలగాలు వెళ్లాయని ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు.
#WATCH | Uttarakhand: On receiving information about people facing difficulty in breathing due to leakage in the chlorine cylinder kept in the empty plot in the Jhanjra area of Prem Nagar police station in Dehradun, Police, NDRF, SDRF and Fire team reached the spot and are… pic.twitter.com/Xq7n71Ot3n
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 9, 2024