న్యూయార్క్, డిసెంబర్ 11: టైమ్ మ్యాగజైన్ ‘ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐ’ని 2025 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికచేసింది. ‘కొంతమంది వ్యక్తులు ఊహించి, డిజైన్ చేసి, ఏఐ వ్యవస్థలను నిర్మించారు’ అని టైమ్ మ్యాగజైన్ అభిప్రాయపడింది. ఆలోచనతో కూడిన యంత్రాల యుగాన్ని అందించి, మానవాళిని ఆశ్చర్యపరిచినందుకు ఏఐ టెక్నాలజీ సృష్టికర్తలను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా టైమ్ మ్యాగజైన్ పేర్కొన్నది. కృత్రిమ మేధ సాంకేతిక వ్యవస్థల బలమేంటో 2025 ఏడాది చూపిందని, ఏఐ టెక్నాలజీ శక్తి సామర్థ్యాలు తిరుగులేని విధంగా గర్జిస్తున్నాయని టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ శామ్ జాకోబ్స్ అభిప్రాయపడ్డారు.