పాట్నా : కేంద్ర మంత్రి, లోక్ జన్‌శక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీహార్ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చీఫ్ విప్ అరుణ్ భార్తీ ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ ప్రకారం పాశ్వాన్ బీహార్ కేంద్రంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.
ఆయన బీహార్‌లో ఉంటూ పార్టీకి నేతృత్వం వహిస్తేనే ఇది సాధ్యం. తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు పాశ్వాన్ బీహార్‌లో పెద్ద పాత్ర పోషించాలని ప్రజలు డిమాండ్ చేశారని అరుణ్ తెలిపారు. దళిత వర్గానికి చెందిన చిరాగ్ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలవడం ద్వారా తాను ఒక వర్గం నాయకుడిగా కాకుండా మొత్తం రాష్ర్టాన్నంతా నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని చాటేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.