చైనా హ్యాకర్ల చేతిలో మన ఇమ్మిగ్రేషన్ డాటా!
పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది.
- వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనాత్మక కథనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది. చైనాకు చెందిన కొన్ని హ్యాకింగ్ ముఠాలు విదేశాల్లోని ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ నేరాలకు పాల్పడినట్టు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో వెల్లడైంది. ఇండియా నుంచే కాక పలు దేశాల నుంచి చైనా హ్యాకర్లు కీలక సమాచారాన్ని దొంగిలించినట్టు కథనాలు ప్రచురితం కావటంతో కలకలం రేగింది. మన డాటా చోరీ చేసిన హ్యాకింగ్ సంస్థకు చైనా ప్రభుత్వం మద్దతున్నదని కథనంలో పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ సంస్థలకు చెందిన సాప్ట్వేర్ వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ఈ సైబర్ దాడులకు పాల్పడినట్టు కథనం పేర్కొన్నది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న ఐసూన్ కంపెనీకి చెందిన పత్రాలు లీకైనట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత వారం ఈ వివరాలు గిట్‌హబ్‌లో వెలుగు చూశాయి. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీగా సేవలందిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

