న్యూఢిల్లీ, అక్టోబర్ 27: భారత్ పట్ల చైనా కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో 38 యుద్ధ విమానాల షెల్టర్స్, మిలిటరీ భవనాల నిర్మాణాన్ని చైనా పూర్తిచేసింది. సరిహద్దులో మెక్‌మోహన్ రేఖకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోని ‘లూంజే’(టిబెట్లోనిది) మిలిటరీ స్థావరం వద్ద వీటిని ఏర్పాటుచేసింది.
భారత్ సహా శత్రుదేశాల క్షిపణి, బాంబు దాడుల్ని తట్టుకొనేలా ఈ షెల్టర్స్‌ను చైనా నిర్మించింది. తద్వారా భారత్‌కు అత్యంత సమీపంలో యుద్ధ విమానాల్ని, క్షిపణులను చైనా మోహరించేందుకు అవకాశం ఏర్పడింది. అరుణాచల్, అస్సాంల నుంచి భారత్ ప్రతి దాడిని అడ్డు కోవడానికి ‘లూంజే’ ఎయిర్‌బేస్ వద్ద షెల్టర్స్ నిర్మాణాన్ని చేపట్టింది.