న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారుతున్నప్పటికీ, వివిధ దేశాల పట్ల ప్రజలకు ద్వేషం, అపనమ్మకం కూడా పెరుగుతున్నాయి. ‘న్యూస్‌వీక్’ విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం, ప్రపంచ ప్రజలు చీదరించుకుంటున్న, ద్వేషిస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో చైనా ఉంది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో రష్యా ఉన్నాయి. భారత్ పదో స్థానంలో ఉంది.
చైనాను ప్రపంచ ప్రజలు అసహ్యించుకోవడానికి కారణాలు ఏమిటంటే, ఆ దేశంలో నియంతృత్వ పాలన, సెన్సార్షిప్, పర్యావరణానికి నష్టం కలిగించడం, వీగర్ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరు. అమెరికా ‘సూపర్‌పవర్’ మెంటాలిటీ, ఆయుధాల పట్ల మోజు, జోక్యం చేసుకునే వైఖరి వంటివి ఆ దేశాన్ని ద్వేషించేలా చేస్తున్నాయి. రష్యాపై ద్వేషానికి కారణాలు.. ఉక్రెయిన్‌పై యుద్ధం, ప్రజాస్వామిక హక్కులపై ఉక్కుపాదం మోపడం.