న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి, ముఖ్యంగా లఢక్ సెక్టార్లో చైనా శరవేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నదని భారత వైమానిక దళ అధిపతి ఏపీ సింగ్ శుక్రవారం తెలిపారు. భారత్ సైతం అదే స్థాయిలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.
విదేశీ గడ్డపై మన శత్రువులను నిర్మూలించే సామర్థ్యం మనకుందని బాలాకోట్ వైమానిక దాడుల్లో చూపించామన్నారు. భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది ఇటీవల మాట్లాడుతూ ఎల్ఎసీ వద్ద పరిస్థితి స్థిరంగానే ఉన్నా సాధారణంగా లేదని తెలిపారు. ఈ విషయమై ఇరు దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో జరుగుతున్న చర్చలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు.