గల్వాన్ లోయలో చైనా జెండా

- ప్రధాని మోదీపై ప్రతిపక్షాల ఆగ్రహం
- ఇప్పటికైనా మౌనం వీడాలన్న రాహుల్
న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో చైనా మరోసారి హద్దుమీరింది. గల్వాన్ లోయలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న ఆ దేశ జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ‘భారత సరిహద్దులోని గల్వాన్ లోయలో ఇంచు భూమిని కూడా వదిలేది లేదని స్పష్టం చేస్తూ చైనా ప్రజలకు సైనికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు’ అని కామెంట్ చేసింది. ఆ దేశ అధికార మీడియా ప్రతినిధి షెన్ షివీ కూడా ‘గల్వాన్ లోయలో చైనా జాతీయ జెండా ఎగిరింది. ఈ జాతీయ జెండా ఒకప్పుడు బీజింగ్లోని తియానన్మెన్ స్కేర్లోనూ ఎగిరింది, అందుకే ఇది ప్రత్యేకమైనది’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు విరుచుపడ్డాయి. ప్రధాని మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘గల్వాన్ లోయలో మువ్వన్నెల జెండా అందంగా కనిపిస్తుంది. చైనాకు దీటుగా బదులివ్వాలి. మోదీజీ.. మౌనం వీడండి’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- flag
- Galwan Valley
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

