న్యూఢిల్లీ : ఇటీవల భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించిన క్రమంలో అగ్రరాజ్యంపై కోపంతో చైనాకు భారత్ దగ్గరవుతున్నది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెల్లిగా పటిష్ఠమవుతున్న వేళ.. పాక్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా చేసిన డిజిటల్ యుద్ధం గురించి అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం వెల్లడించింది.
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని కృత్రిమ మేధ సహాయంతో చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని పేర్కొంది. ఏఐ ద్వారా తయారు చేసిన నకిలీ చిత్రాలను ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చైనా ప్రచారం చేసినట్టు నివేదిక వెల్లడించింది. తమ క్షిపణులతో భారత్, ఫ్రాన్స్ యుద్ధ విమానాలను కూల్చేశామని చైనా ప్రచారం చేసుకున్నట్టు అభిప్రాయపడింది.