అరుణాచల్‌లో చైనా భారీ నిర్మాణాలు
అరుణాచల్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చగ్లాగామ్‌లోని హడిగర డెల్టా-6 ప్రాంతంలో చైనా భార నిర్మాణ యంత్రాలను
న్యూఢిల్లీ, ఆగస్టు 27: అరుణాచల్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చగ్లాగామ్‌లోని హడిగర డెల్టా-6 ప్రాంతంలో చైనా భార నిర్మాణ యంత్రాలను మోహరించింది. సాధారణంగా చగ్లాగామ్ నుంచి నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాలంటే నాలుగు రోజులు పడుతుంది. స్థానికులు సాహసించి వెళ్లి చైనా సైన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై వీడియోలు తీయడం విశేషం.
భారత భూభాగంలో చైనా బుల్డోజర్లా?
హైదరాబాద్, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ): భారత భూభాగం అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఏం చేస్తుందో ప్రధాని మోదీకి తెలుసా? అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. దేశ సరిహద్దు అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా బుల్డోజర్లపై ఒక ఆంగ్లపత్రిక వీడియో కథనాన్ని ఒవైసీ తన ట్విట్టర్లో జత చేస్తూ, చైనా పేరు చెప్పడానికి కూడా భయపడే ప్రధాని మోదీ కనీసం అది అరుణాచల్‌లో ఏం చేస్తుందో చెబుతారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించడానికి పార్లమెంట్‌ను సమావేశపర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

