అహ్మదాబాద్: ఆంగ్ల భాషకు తాను ఎంతమాత్రం వ్యతిరేకిని కాదని, అయితే ప్రతి విద్యార్థి మాతృ భాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది దేశీయ భాషల పరిరక్షణకు చాలా అవసరమన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ మాతృభాషతో పాటు హిందీని నేర్చుకుంటే దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రపంచం మొత్తంలో జ్ఞాన సంపదను ఆర్జించే ప్రదేశం ఏదైనా ఉందంటే అవి ఉపనిషత్లు, వేదాలు, సంస్కృతం మాత్రమేనన్నారు.