కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యరాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సిలిగురి ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్ డిమాండ్ చేశారు. బెంగాల్లో మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కందుని, పార్క్ స్ట్రీట్, మతిగర, చోప్రా, అరియదహ, కలియాగంజ్, హంష్ఖలి సహా పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమయ్యారని వెల్లడవుతున్నదని చెప్పారు. ఆర్జీ కార్ ఘటన అనంతరం ఘటనా స్ధలం మీడియా కంటపడకుండా సీఎం ప్రయత్నించారని ఆరోపించారు.
మహిళలపై తీవ్ర నేరాలు పెచ్చుమీరుతున్నాయని, దీదీ సర్కార్ హయాంలో మహిళలకు భద్రత కరవైందని వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకున్నా వారిని కఠినంగా శిక్షించడం లేదని ఆరోపించారు. ఇక కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సిలిగురిలో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
Read More :
Shadnagar Incident | దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్నగర్ డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు