ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీకి పార్లమెంట్ అంటే అపారగౌరవమని ఎంతంటే.. అమరులైన జవాన్లకు డిసెంబర్ 13న నివాళులర్పించడానికి కూడా సమయం లేనంతగా అంటూ చిదంబరం దెప్పిపొడిచారు. వారణాసి వెళ్లడానికి ఆయన ఏ కార్యక్రమానికైనా డుమ్మాయే కొడతారని విమర్శించారు. మోదీని వారణాసి, అయోధ్య లాంటి ప్రాంతాల్లో మాత్రమే చూస్తామని, పార్లమెంట్లో మాత్రం కాదని చిదంబరం సెటైర్ వేశారు.