వ్యవసాయ చట్టాల రద్దు : మోదీని హిట్లర్‌తో పోల్చిన చిదంబరం!

పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్‌తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయనేది రైతుల విజయం విస్పష్ట సంకేతాలు పంపిందని సాగు చట్టాల రద్దుపై చిదంబరం వ్యాఖ్యానించారు. మోదీ ప్రజాస్వామ్య ముసుగులో నియంతలా వ్యవహరిస్తారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఇటీవల పెట్రో ధరలు తగ్గించిన తరహాలోనే రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వ్యవసాయ చట్టాల రద్దును ప్రకటించారని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, పార్లమెంట్‌కు భయపడదని, ఎన్నికల్లో ఓటమికే భయపడుతుందని ప్రజలకు తెలిసివచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచాలని ఎవరైనా అనుకుంటే ప్రతి ఎన్నికల్లో పాలక పక్షానికి గుణపాఠం నేర్పాలని చిదంబరం పిలుపు ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

