Heavy Rain | బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వచ్చే 12 గంటల్లో (27వ తేదీకి) అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ (IMD) హెచ్చరించింది. ఈ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి (Heavy Rain). చెన్నై (Chennai), నాగపట్నం, చెంగల్పట్టు, తిరువావూర్, కడలూరు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
#WATCH | Tamil Nadu’s Cuddalore sees rain as deep depression forms over southwest Bay of Bengal
As per IMD, the deep depression is very likely to continue to move north-northwestwards and intensify further into a cyclonic storm on 27th November. pic.twitter.com/bGI03iIhY7
— ANI (@ANI) November 26, 2024
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కావేరి డెల్టా జిల్లాలైన (Cauvery Delta districts) నాగపట్నం, మైలదుత్తురై, తిరువావూర్, పుదుచ్చేరిలోని పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
#WATCH | Chennai receives heavy rain as a result of the formation of a deep depression in the Bay of Bengal pic.twitter.com/sEiRYIPWLq
— ANI (@ANI) November 26, 2024
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి సమీప ఓడరేవులకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించారు.
#WATCH | Tamil Nadu’s Thiruvarur witnesses heavy rains as deep depression forms in the Bay of Bengal pic.twitter.com/kRU4iqxqrV
— ANI (@ANI) November 26, 2024
#WATCH | Tamil Nadu | Chengalpattu receives heavy rainfall owing to the formation of a deep depression in the Bay of Bengal pic.twitter.com/PGN8EBX1CU
— ANI (@ANI) November 26, 2024
#WATCH | Tamil Nadu | Formation of a deep depression in the Bay of Bengal leads to heavy rainfall in Nagapattinam pic.twitter.com/c6IjnvqAro
— ANI (@ANI) November 26, 2024
Also Read..
Mumbai Terror Attack | 26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు
AR Rahman | ఆయన నాకు తండ్రిలాంటి వారు.. రెహమాన్‌తో రిలేషన్ షిప్ వార్తలపై మోహినీ దే క్లారిటీ
Samantha | నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు.. డివోర్స్ తర్వాత ఎన్నో ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నా : సమంత