Chennai Airport | కాస్త శాంతించిన వరుణుడు.. చెన్నైలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
Chennai Airport | చెన్నైలో వరుణుడు కాస్త శాంతించాడు. మంగళవారం తెల్లవారుజామున నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడట్లేదు. దీంతో చెన్నై నగరం వరద ప్రభావం నుంచి కాస్త తేరుకుంటోంది. ఈ క్రమంలోనే భారీ వర్షం కారణంగా మూసివేసిన చెన్నై విమానాశ్రయాన్ని (Chennai Airport) అధికారులు తిరిగి తెరిచారు.
Chennai Airport | మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. అయితే, తాజాగా చెన్నైలో వరుణుడు కాస్త శాంతించాడు. మంగళవారం తెల్లవారుజామున నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడట్లేదు. దీంతో చెన్నై నగరం వరద ప్రభావం నుంచి కాస్త తేరుకుంటోంది.
ఈ క్రమంలోనే భారీ వర్షం కారణంగా మూసివేసిన చెన్నై విమానాశ్రయాన్ని (Chennai Airport) అధికారులు తిరిగి తెరిచారు. వర్షం తెరపివ్వడంతోపాటు, రన్వేపై నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి విమాన రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం నుంచి అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే.
మరోవైపు తమిళనాడులోని 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నైలోని రీజియన్ వాతావరణ విభాగం (Region Meteorological Department) అంచనా వేసింది. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కన్యాకుమారి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Understand this is Chennai airport today.
The sea seems to have taken it over.
And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez
— Tarun Shukla (@shukla_tarun) December 4, 2023
Also Read..
Telangana | సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఖర్గే కీలక ప్రకటన
Michaung Cyclone | మిగ్జాం తుఫాను ఎఫెక్ట్.. భారీ వర్షాలకు చెన్నైలో 8 మంది మృతి
Michaung Cyclone | బాపట్ల దగ్గర తీరం తాకిన మిగ్జాం తుఫాను.. 11 జిల్లాల్లో భారీ వర్షం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

