Drunk and driving | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మహిళ.. పోలీసుల కన్నుగప్పి పరార్
Drunk and driving | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో(Drunk and driving) పట్టుబడిన మహిళను(Woman) తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన(Escaped) వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్,ఏప్రిల్ 29 : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో(Drunk and driving) పట్టుబడిన మహిళను(Woman) తప్పించేందుకు వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన(Escaped) వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన మహేంద్ర థార్ (టీఎస్08జేజెడ్4566)ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా పక్కసీటులో కూర్చున్న వ్యక్తి తాను కారును పక్కకు తీస్తానంటూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. కారును వేగంగా వెనక్కి తీస్తూ బైక్‌ను ఢీకొట్టాడు.
దాంతో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా వేగంగా ముందుకు దూకిస్తూ బారికేడ్లను ఢీకొట్టడంతో పాటు అడ్డుగా వచ్చిన ట్రాఫిక్ హోంగార్డు దుర్గారావును ఢీకొట్టడంతో పాటు అక్కడినుంచి కారుతో సహా పారిపోయాడు. ఈ మేరకు హోంగార్డు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ 332,353,279 రెడ్‌విత్ 34తో పాటు 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారు బందుగల శివాలీరెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

