IPL 2024: పదిహేడో సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల మోతతో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. అంతేకాదు కెప్టెన్‌గా లేకున్నా సరే మహీ భాయ్ తన మార్క్ వ్యూహాలతో బౌలర్లకు అండగా నిలుస్తున్నాడు. ఆదివారం చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన ప్లానింగ్‌కు తిరుగులేని నిరూపించాడు. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head)ను పెవిలియన్ పంపడంలో సక్సెస్ అయ్యాడు.
చెపాక్‌లో రుతురాజ్ గైక్వాడ్ సేన ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్‌కు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(13), అభిషేక్‌లు దూకుడుగా ఆడారు. అయితే.. ఈ జోడీని విడదీసేందుకు ధోనీ వ్యూహం పన్నాడు. అప్పటికీ డారిల్ మిచెల్ మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. దేశ్‌పాండే బంతి అందుకోగా.. హెడ్ ఏ షాట్ ఆడుతాడో ముందే ఊహించిన ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు.
MS Dhoni Captaincy masterclass for Travis Head 🔥 pic.twitter.com/knQa2NhuOf
— N. (@Relax_Boisss) April 29, 2024
మిచెల్‌ను కొంచెం ముందుకు రమ్మని చెప్పాడు. తుషార్ దేశ్‌పాండే బంతి వేశాడో లేదో.. చెప్పినట్టే హెడ్ భారీ షాట్ ఆడాడు. కానీ, ఆ బంతి నేరుగా వెళ్లి మిచెల్ చేతిలో పడింది. దాంతో, ఆ బంతి సిక్సర్ అనుకున్న హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) డీలా పడగా.. చెన్నై ఆటగాళ్లు సంబురాల్ల మునిగిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కమిన్స్ సేన 134 పరుగులకే కుప్పకూలింది. దాంతో, 78 పరుగుల తేడాతో గెలుపొందిన సీఎస్కే అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.
Travis Head ✅
Anmolpreet Singh ✅Tushar Deshpande making the most of his first over 💪#SRH 42/3 after 4 overs
Watch the match LIVE on @officialjiocinema and @starsportsindia 💻📱#TATAIPL | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/d9AuXctocS
— IndianPremierLeague (@IPL) April 28, 2024