Champai Soren : బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి కార్యాచరణపై తాము ఇంకా చర్చించలేదని, తాను ఈ నెల 30న బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. చంపై సోరెన్ బుధవారం రాంచీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు.
గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి ఈస్ధాయికి చేరుకున్నానని, జార్ఖండ్ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్ వెల్లడించారు. కాగా, చంపై సోరెన్ బీజేపీలో చేరికపై జార్ఖండ్ బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండీ స్పందించారు.
చంపై సోరెన్‌పై జార్ఖండ్ సర్కార్ నిఘా వేయడం సరైంది కాదని దుయ్యబట్టారు. మాజీ సీఎంపై గూఢచర్యం ప్రయోగించి ఉండాల్సింది కాదని అన్నారు. హనీ ట్రాప్‌నకు కూడా సన్నాహాలు జరిగాయని తమకు సమాచారం అందిందని, ఈ వ్యవహారం అంతటిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలని బాబూలాల్ మరాండీ డిమాండ్ చేశారు. చంపై సోరెన్‌కు బీజేపీలో సముచిత స్ధానం లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
Read More :
Gujarat | గుజరాత్లో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కుప్పకూలిన బ్రిడ్జ్.. షాకింగ్ వీడియో