CERT-In | ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. క్రోమ్ బ్రౌజర్లో భారీగా బగ్స్ ఉన్నాయని.. వాటితో యూజర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా బగ్‌ల బారినపడకుండా ఉండేందుకు పలు సూచనలు చేసింది. బ్రౌజర్లో పెద్ద ఎత్తున ఉన్న లోపాలు, బగ్‌ల సహాయంతో హ్యాకర్లు ఎలాంటి సిస్టమ్‌నైనా హ్యాక్ చేయగలరని.. రిమోట్‌గా సైతం నియంత్రించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. క్రోమ్ బ్రౌజర్లో సేవ చేసిన పాస్‌వర్డ్‌లను హ్యాకర్స్ చూడడంతో పాటు కాపీ చేసేందుకు ఛాన్స్ ఉందని తెలిపింది. గూగుల్ క్రోమ్ విండోస్‌లో 128.0.6613.113/114తో పాటు అంతకుముందు వెర్షన్లు, మ్యాక్‌లో 128.0.6613.113/.114, లినక్స్లో 128.0.6613.113తో పాటు అంతకు ముందు వెర్షన్లలో బగ్‌లు ఉన్నాయని పేర్కొంది.
ఆయా వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారంతా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అప్డేట్ చేసుకునేందుకు మొదట బ్రౌజర్ మెనుకు వెళ్లి హెల్ప్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎబౌట్ గూగుల్ క్రోమ్‌ని సెలెక్ట్ చేయాలి. దీంతో బ్రౌజర్ ఆటోమేటిక్‌గా అప్డేట్ చేసి కొత్త వెర్షన్‌ని ఇన్స్టాల్ చేస్తుంది. భవిష్యత్‌లో సైబర్ దాడుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్ క్రోమ్ ఆటోమేటిక్ అప్డేట్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫలితంగా బ్రౌజర్ ఎప్పటికప్పుడు కొత్త సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా సెర్ట్ అనేది భారత ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని ప్రధాన పాత్ర భారతీయ సైబర్ కమ్యూనిటీలో అవగాహన కల్పించడం, సాంకేతిక సహాయం అందించడం, ఏవైనా సెక్యూరిటీ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు సలహాలను జారీ చేస్తుంది.