న్యూఢిల్లీ, జూలై 18: ప్రైవేట్ రంగంలో స్థానికులకు సింహ భాగం ఉద్యోగాలు కల్పించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు స్థానిక కోటా బిల్లుపై ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా వివిధ రాష్ర్టాల్లో నివసించిన తన లాంటి వారికి ఈ బిల్లు అసమంజసమని తెలిపారు. ‘మా నాన్న భారత నౌకాదళ ఉద్యోగిగా దేశమంతటా పనిచేశారు.
నేను ఏ రాష్ట్రంలోనూ 15 ఏండ్ల కంటే ఎక్కువ నివసించలేదు’ అని ఆయన బుధవారం ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ‘నేను కొన్ని కంపెనీలు స్థాపించి దేశ వ్యాప్తంగా 25 వేల ఉద్యోగాలు సృష్టించాను. అయినప్పటికీ కర్ణాటకలో పెరిగిన నా పిల్లలు ఇక్కడి ఉద్యోగాలకు అర్హులు కారా’ అని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వ ప్రయత్నాలు సిగ్గుచేటని మండిపడ్డారు.