NREGA | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: 2022-2024 మధ్య కాలంలో 1.55 కోట్ల మంది క్రియాశీల కూలీల పేర్లను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించినట్టు కేంద్రం మంగళవారం పార్లమెంట్‌కు తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి కమలేశ్ పాశ్వాన్ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 86.17 లక్షలు, 2023-24లో 68.86 లక్షల మంది కూలీల పేర్లను తొలగించినట్టు చెప్పారు.
నకిలీ లేదా డూప్లికేట్ లేదా సరైనవి కాని జాబ్ కార్డుల కారణంగా, కుటుంబాలు తమ గ్రామ పంచాయతీ నుంచి శాశ్వతంగా నివాసాన్ని మార్చడం వల్ల ఈ తొలగింపులు చేశామన్నారు. పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ర్టాలు, యూటీలపైనే ఉంటుందన్నారు.