న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న, ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. మొదటిసారి అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999-2000 బడ్జెట్ను 1999, ఫిబ్రవరి 28న ఆదివారం ప్రవేశపెట్టారు.