న్యూఢిల్లీ, జూలై 7: రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు విధించింది.
పిండిని ఎగుమతి చేయాలంటే ముందుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనుమతి తీసుకోవాలని నిబంధన విధించింది. గోధుమలు, గోధుమ పిండి విషయంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నదని, నాణ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొన్నది.