న్యూఢిల్లీ, నవంబర్ 9: పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే అధికారాన్ని 9 రాష్ర్టాల్లోని హోం శాఖ సెక్రటరీలకు, 31 జిల్లాల కలెక్టర్లకు కేంద్రం కల్పించింది. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయా దేశాలకు చెందిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రిస్టియన్, పార్సీ వర్గాలకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం పౌరసత్వం కల్పించొచ్చని కేంద్రం తెలిపింది.
బీజేపీయేతర రాష్ర్టాలపై శీతకన్ను
బీజేపీయేతర రాష్ర్టాలపై చిన్నచూపు చూపిస్తున్న కేంద్రం.. పౌరసత్వం కల్పించే అధికారం ఇవ్వటంలోనూ శీతకన్ను ప్రదర్శించింది. కేంద్రం ప్రకటించిన రాష్ర్టాల్లో ఏ ఒక్కటీ దక్షిణాది రాష్ట్రం లేకపోవటం గమనార్హం. అంతేకాదు.. పౌరసత్వ సమస్య ఉన్న అస్సాం, బెంగాల్ రాష్ర్టాలకు కూడా కేంద్రం అధికారం ఇవ్వలేదు.