న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై (TRF) కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీఆర్ఎఫ్ కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారినికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది.
కాగా, ఆర్టీఎఫ్ రోజురోజుకు తీవ్రవాద కార్యకలాపాలను తీవ్రంతరం చేస్తున్నట్లు నిఘా సంస్థలు గురించాయి. ఆన్లైన్ మీడియాను ఉపయోగించి యువతను రిక్రూట్ చేస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారం, టెర్రరిస్టుల చొరబాట్లు, పాకిస్థాన్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో టీఆర్ఎఫ్ ప్రమేయం ఉందని కేంద్ర ప్రభుత్వం తన గెజిట్‌లో పేర్కొన్నది. అదేవిధంగా జమ్ముకశ్మీర్‌కు చెందిన ఎల్ఈటీ కమాండర్ మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ఉగ్రవాదిగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లో ఉంటున్నాడని తెలిపింది.
Ministry of Home Affairs today declared The Resistance Front (TRF)-an offshoot of Pakistan-based proscribed terror outfit Lashkar-e-Taiba- & all its manifestations & front organisations as terrorist organizations under Unlawful Activities (Prevention) Act 1967: MHA pic.twitter.com/NeaD8YvRUk
— ANI (@ANI) January 5, 2023