న్యూఢిల్లీ: పాము కాటు సంఘటనలు, వాటి వల్ల సంభవించే మరణాల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాము కాటును గుర్తించదగిన(నోటిఫయబుల్) వ్యాధుల జాబితాలో చేర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రాష్ర్టాల ప్రజారోగ్య చట్టాలు లేదా ఇతర వర్తించే చట్టాల్లో దీనిని చేర్చాలని చెప్పింది.
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కేంద్రాలు ఈ కేసుల గురించి అధికారులకు తెలియజేయడం తప్పనిసరి చేయాలని తెలిపింది. పాము కాటు వల్ల మరణాలు, అంగవైకల్యం వంటివి సంభవించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల రాష్ర్టాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం లబ్ధిదారులకు ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, సోవా రిగ్ప, హోమియోపతి) ప్యాకేజీలు లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది. సెకండరీ, ప్రాంతీయ దవాఖానల్లో చికిత్సకు సంవత్సరానికి ఒక కుటుంబానికి రూ.5 లక్షల వరకు సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది.