న్యూఢిల్లీ, నవంబర్ 5: సబ్సిడీ రేట్లపై భారత్ బ్రాండ్ ద్వారా రెండో విడతగా గోధుమ పిండి, బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. గోధుమ పిండి కిలో రూ.30, బియ్యం కిలో రూ.34కు 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్లలో అందించనున్నట్టు చెప్పింది.
నాఫెడ్, కేంద్రీయ భాండార్, ఈ కామర్స్ ఎన్సీసీఎఫ్ కోఆపరేటివ్ సంస్థల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం జెండా ఊపి ప్రారంభించిన ఆయన మొదటి విడతకు, రెండో విడతకు తాత్కాలిక విరామం వచ్చిందని చెప్పారు. మొదటి విడత కన్నా రెండో విడత బియ్యం, గోధుమ పిండి ధరలు స్వల్పంగా పెరిగినట్టు (గతంలో రూ.27.5, రూ.29) మంత్రి జోషి తెలిపారు.