16 ఎఫ్డీసీ మందులపై నిషేధం.. కేంద్రం ప్రకటన
కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది. చికిత్సాపరమైన సమర్థన లేకపోవడం, వాటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని పేర్కొంటూ వీటిని నిషేధించినట్లు కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది. చికిత్సాపరమైన సమర్థన లేకపోవడం, వాటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని పేర్కొంటూ వీటిని నిషేధించినట్లు కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, అలాగే ప్రభావవంతమైన, శాస్త్రీయంగా ధృవీకరించిన ఔషధాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
నిషేధిత ఫార్ములేషన్లలో కొన్ని చర్మ సంబంధిత మందులు, నొప్పి నివారణ మందులు, కండరాల సడలింపు మందులు, యాంటీబయాటిక్ సహా పలు రకాల చికిత్సా విభాగాలు ఉన్నాయని కేంద్రం పేర్కొన్నది. నిషేధిత జాబితాలో కలబంధ లేదా కలబంధ సారంతో పాటు విటమిన్ ఇ, జోఓబా నూనె, నారింజ నూనె, గోధుమ వంటి పదార్థాల కలయికలను కలిగి ఉన్న అనేక చర్మ వ్యాధి, చర్మ సంరక్షణ ఫార్ములేషన్లు కూడా ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26ఏ కింద జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా మంత్రిత్వశాఖ ఎఫ్డీసీని నిషేధించింది. మానవ వినియోగం కోసం గుర్తించిన 16 ఎఫ్‌డీసీల తయారీ, అమ్మకం, పంపిణీ, సరఫరాపై దేశవ్యాప్తంగా నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

