న్యూఢిల్లీ: గోధుమల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ట్రేడర్స్/హోల్‌సేలర్స్ కేవలం 250 టన్నుల గోధుమలను మాత్రమే తమ వద్ద నిల్వ ఉంచుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 1,000 టన్నులు ఉండేది. రిటైలర్స్ వద్ద ప్రతి ఔట్‌లెట్‌కు 4 టన్నుల గోధుమలను మాత్రమే నిల్వ ఉంచుకోవచ్చు.
గతంలో ఈ పరిమితి 5 టన్నులు ఉండేది. గోధుమల ధరలను నిలకడగా ఉంచడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఈ ఆదేశాలు వచ్చే నెల 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే, నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.