Manipur Viral Video Case: మణిపూర్ వైరల్ వీడియో కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
Manipur viral video case: మణిపూర్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. మహిళల్ని నగ్నం ఊరేగించిన ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. మరో వైపు ఇవాళ 20 మంది విపక్ష సభ్యులు మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవాం బిష్ణుపుర్‌లో ఇండ్లకు నిప్పుపెట్టారు. నిన్న జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసు(Manipur Viral Video Case)లో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కుకీ తెగలకు చెందిన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు చెందిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వైరల్ వీడియో కేసులో దర్యాప్తు చేపట్టనున్నట్లు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మణిపూర్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించిన తర్వాతే ఆ కేసును సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు.
కాంగ్పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఇద్దరు మహిళల్ని న్యూడ్‌గా ఊరేగించిన ఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ మణిపూర్ అంశం దుమారం రేపుతోంది. ఇవాళ 20 మంది విపక్ష నేతలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

