న్యూఢిల్లీ : ప్రాణాంతక క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో కాస్త ఉపశమనం కనిపించింది. దిగుమతి చేసుకున్న, అత్యధిక ధర కలిగిన మందులపై వీరు ఆధారపడతారు. వీరికి ఉపయోగపడే 17 రకాల మందులపై దిగుమతి సుంకాలను మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. దీనివల్ల అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తున్నది.
మరీ ముఖ్యంగా సమగ్ర బీమా కవరేజ్ లేని వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరం. దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు పొందిన మందులు… రిబోసిక్లిబ్, అబెమాసిక్లిబ్, టలికాబ్టాజీన్ఆటోల్యూసెల్, ట్రెమెలిముమాబ్, వెనెటోక్లాక్స్, సెరిటినిబ్, బ్రిగాటినిబ్, డరోల్యూటమైడ్, టోరిపలిమాబ్, సెర్ప్లులిమాబ్, టిస్లెలిజుమాబ్, ఐనోటుజుమాబ్ ఓజోగమైసిన్, పొనటినిబ్, ఇబ్రుటినిబ్, డబ్రఫెనిబ్, ట్రమెటినిబ్, ఇపిలిముమాబ్.